బిజినెస్ ఐడియా: ఈ పూలని సాగుచేస్తే అధిక రాబడి పొందొచ్చు..!

-

మీరు ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? ఆ వ్యాపారం తో మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసం ఒక బిజినెస్ ఐడియా. అదే లిల్లీ పూలను సాగు చేయడం. లిల్లీ పూల కి భారత దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే డెకరేషన్ లకి లిల్లీ పూలను ఎక్కువగా వాడుతూ ఉంటారు.

చూడడానికి ఈ పూలు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనబడుతాయి. ఇవి మనకి అనేక రంగుల్లో లభిస్తాయి. కనుక సాగు చేస్తే మంచిగా డబ్బులు సంపాదించవచ్చు. ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తూ ఉంటారు రైతులు. అలానే మహారాష్ట్రలో కూడా లిల్లీ పూల సాగు జరుగుతుంది. అయితే వీటిని కనుక మీరు సాగు చేశారు ఉంటే చక్కగా డిమాండ్ ఉంది కాబట్టి మీకు డబ్బులు వస్తాయి.

కొండ రాష్ట్రాలలోని వాతావరణం వీటికి బాగా అనుకూలంగా ఉంటుంది. మీరు లిల్లీ పూల పెంపకం ఎలా చేయాలి అనేది తెలుసుకుని దాని ద్వారా మీరు పెంచొచ్చు. ఈ పూలని సాగు చేసే మొదటి దశలో కణజాల సంస్కృతి ప్రక్రియ ద్వారా నర్సరీని సిద్ధం చేసుకోవాలి. రెండవ దశ లో మొక్కలు నాటాలి. మూడవ దశలో దుంపలను నాటాలి. దీంతో పూలు వస్తాయి. ఇలా లిల్లీ పూల సాగు చేసి అధికంగా సంపాదించచ్చు. పైగా ఖర్చు కూడా తక్కువ అవుతుంది. కనుక ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకునే వారు ఇలా చక్కగా లిల్లీ పూల బిజినెస్ చేసి అద్భుతంగా రాబడి పొందొచ్చు. పైగా ఈ బిజినెస్ లో ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

Read more RELATED
Recommended to you

Latest news