తూర్పుగోదావరి జిల్లాలో మద్యం మాఫియా పేట్రేగిపోతుంది. యానాం నుంచి బోట్లలో మద్యం తరలించి జిల్లాలో జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. పల్లంలో నీల్లరేవు వంతెన వద్ద పోలీసులను ప్రతిఘటించింది మద్యం మాఫియా. మద్యంతో సహా బోటులోనే పరారయ్యారు. పరారైన వారిలో ఇద్దరికి బేడీలు ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో బోటును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
పల్లం గ్రామంలో పోలీసులపై తిరగబడిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మద్యం మాఫియా వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఘటనపై పోలీసులపై అనేక ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తుంది.