క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది..ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా క్రికెట్ లీగ్ మార్చి 31న ప్రారంభమవుతుంది..ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతుంది. గత డిసెంబర్‌లో జరిగిన మినీ వేలం ప్రక్రియలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ వారం, కొంతమంది విదేశీ ఆటగాళ్లు మినహా, మిగిలిన ఆటగాళ్లందరూ తమ తమ జట్లతో చేరతారు. సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని నెల రోజుల ముందే ప్రాక్టీస్ ప్రారంభించాడు.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా గత సీజన్లలో ప్రారంభ వేడుకలు జరగలేదు. ఈ క్రమంలో సుమారు 4 సంవత్సరాల తర్వాత మన దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి.. ఈ నెల 31న గుజరాత్ -చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్ ఇండియాలోనే అతి పెద్ద స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్యాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న తన డ్యాన్స్‌తో అభిమానులను అలరించనుందని సమాచారం. అలాగే తమన్నా భాటియా కూడా స్టెప్పులు వేయనుందట. ఇక ఫేమస్ బాలీవుడ్ సింగర్ అరిజిత్ సింగ్ కూడా పాటను పాడనున్నారని తెలుస్తుంది..
ఇటీవల మహిళల ఐపీఎల్‌కు ముందు కూడా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించింది. అయితే పెద్దగా సినీ గ్లామర్ లేకపోవడంతో ఆ వేడుక పెద్దగా ఆకట్టుకోలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్-2023 ప్రారంభ వేడుకను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందుకోసం రష్మిక, తమన్నా లాంటి పాన్ ఇండియా బ్యూటీలను రంగంలోకి దించాలనుకుందట. వీరితో పాటు మరికొంత మంది మేల్, ఫిమేల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్‌లు ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారని క్రికెట్ అధికారులు తెలిపారు.. మరికొద్ది రోజులే ఉండటంతో జనాలు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..