లాక్ డౌన్ తో 90 శాతం ఈ మహమ్మారిని నియంత్రించొచ్చట!

34

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ దేశాలు చాలా లాక్ డౌన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ తో ఈ మహమ్మారిని దాదాపు 90 శాతం మేరకు నియంత్రించొచ్చు అంటూ ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి సోకి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 4 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20 వేలమందికి పైగా ప్రాణాలు పోగుట్టుకున్న సంగతి తెలిసిందే. భారత దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్ తీవ్రత మరింత పెరుగుతుండడం తో లాక్ డౌన్ పీరియడ్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేసారు కూడా. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ఈ వైరస్ ను చాలా వరకు నియంత్రించవచ్చు అంటూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సమాధానం ఇచ్చింది. వైరస్ లక్షణాలతో ఉన్న వారిని హోం క్వారంటైన్ లో ఉంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని కనీసం 62 శాతం నియంత్రించవచ్చని తెలిపింది. ఇలా సామాజిక దూరం పాటించడం వల్ల.. వ్యాప్తి తీవ్రతను బట్టి 89శాతం వరకు వైరస్ ను అడ్డుకోవచ్చని అభిప్రాయపడింది. కావున దేశవ్యాప్తంగా అమలుచేస్తున్న 21రోజుల లాక్ డౌన్, స్క్రీనింగ్, ప్రయాణాలపై ఆంక్షలు.. వైరస్ కట్టడి ఉపయోగపడతాయని పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా చైనా,ఇటలీ,ఫ్రాన్స్ అమెరికా దేశాల్లో ఈ కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతుండగా,మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారి పుట్టిన చైనా లో కొద్దిగా ఇప్పుడిప్పుడే కుదురు కుంటున్నప్పటికీ ఇతర దేశాల్లో మాత్రం దీని ప్రభావం మరింత ప్రబలుతోంది. దీనితో చాలా దేశాలు కూడా ఈ లాక్ డౌన్ ను పాటిస్తూ ఈ వైరస్ మహమ్మారి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటున్నారు.