ఈసారి ఎంత దోచుకుంటారో?.. నిర్మలమ్మపై కాంగ్రెస్ విమర్శలు

-

 కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బాండ్ల రూపంలో ఈసారి ఎంత దోచుకుంటారో అని విమర్శించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధం అంటూ తీర్పు ఇచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని తాము తిరిగి అధికారంలోకి వస్తే.. మళ్లీ తీసుకువస్తామని కేంద్రమంత్రి సీతారామన్ ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు.

‘పే పీఎం స్కామ్’ కింద బీజేపీ రూ.4 లక్షల కోట్లు దోచుకుందని, మళ్లీ ఇప్పుడు ఆ దోపిడీని కొనసాగించాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈసారి ఎంత దోచుకుంటారో..? అందుకే ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. అదృష్టవశాత్తూ ఈ అవినీతి దళం బయటకు వెళ్లిపోతుందని క్షేత్రస్థాయి నివేదికలు వెల్లడిస్తున్నాయని జైరాం రమేశ్‌ విమర్శలు గుప్పించారు.

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.  ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news