హోమ్ మినిస్టర్ అమిత్ షా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,వాద్రా లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వీరు ప్రతి మూడు నెలలకోసారి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తారు అని విమర్శించారు.రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ ఎంపీ అభ్యర్థి ఓం బిర్లాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రియాంక గాంధీ ఎన్నికలున్నాయనే కారణంతో థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చారు అని మండిపడ్డారు. వారికి దేశ ప్రజలపై ప్రేమ ఎక్కడిది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉగ్రవాదులు చొరబడి దాడులు చేసేవారు అని గుర్తు చేశారు.
బీజేపీ హయాంలో ఒక్క ఉగ్రదాడి జరిగిన దాఖలాలు లేవు. దేశంలోని అన్ని కేంద్ర సంస్థల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కృషిచేశాం అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పెంచారు. మా హయాంలో కమ్మరి, టైలర్లు, వడ్రంగులు, పడవలు తయారు చేసే వారు.. ఇతర చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు రూ.13,000 కోట్లు వెచ్చించి నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలతో అనుసంధానం చేశాం అని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. ఈవీఎంపై కమలం గుర్తు బటన్‌ను గట్టిగా నొక్కండి. తద్వారా ఇటలీలో షాక్‌లు ఉద్భవించాలి అని పిలుపునిచ్చారు. రాజస్థాన్‌లో బీజేపీ 25 సీట్లు సాధించబోతోంది అని ధీమా వ్యక్తం చేశారు.