సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ ఇవాళ జరగనుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8చొప్పున, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదు చొప్పున, ఛత్తీస్‌గఢ్, బంగాల్‌లో మూడు చొప్పున, మణిపుర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కోస్థానానికి ఓటింగ్ జరగనుంది. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఈ విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 194మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
లోక్సభ రెండో విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో బంగాల్, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చాలా వేడిగా ఉంటుందని హెచ్చరించారు. బంగాల్, ఒడిశాకు రెడ్ వార్నింగ్, బిహార్, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. త్రిపుర, కేరళ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం, మేఘాలయ, గోవాలో అధిక తేమ కారణంగా ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.