ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ ఓడింది. మరోవైపు ఆరు ఓటముల తర్వాత బెంగళూరు ఈ సీజన్లో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(51) హాఫ్ సెంచరీ బాదాడు. రజత్ పాటిదార్ 20 బంతుల్లో 50 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లపై విరుచుకుపడుతూ తద్వారా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిచాడు. కామెరూన్ గ్రీన్ 20 బంతుల్లో 37 పరుగులు, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 12 బంతుల్లో 25 పరుగులు, స్వప్నిల్ సింగ్ 12 పరుగులు, కార్తీక్ 11 పరుగులు చేశాడు.