నారా లోకేష్: ప్రత్యేక హోదా గురించి ఏనాడైనా కేంద్రాన్ని అడిగారా..?

-

ఎన్నికల ముందు 25 ఎంపీలు గెలిస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని వైకాపా చెప్పిందని ఆ దిశగా కృషి చేసిందా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడిగారు మన్యం జిల్లాలో జరిగిన శంఖారావం సభ లో లోకేష్ మాట్లాడారు వైకాపా కి 22 మంది లోక్సభ 9 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నప్పటికీ ప్రత్యేక హోదా మీద ఎప్పుడైనా కేంద్రాన్ని అడిగారా అని నిలదీశారు.

లోకేష్ వైకాపా నాయకులు సామాజిక బస్సుయాత్ర చేస్తున్నారని అసలు ఆ పార్టీలోనే సామాజిక అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఎన్నికల వల్ల సీఎం జగన్ ఇప్పటిదాకా 63 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎంపీలని బదిలీ చేశారని అన్నారు. అయితే వాళ్లలో 90 శాతం మంది బీసీ ఎస్సీ నాయకులే ఉన్నారని లోకేష్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news