కరోనా జనాల చేత రకరకాల పనులు చేయిస్తోంది. ఏకంగా ఒక మహిళ కరోన భయంతో వాట్సాప్ లో వచ్చిన ఒక వార్తను నమ్మి కొద్ది రోజులుగా ఉదయాన్నే.. ఆమె తన మూత్రాన్ని తాగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత పిల్లలతో కూడా వారి మూత్రాన్ని తాగించేది. వరుసగా నాలుగు రోజులు ఆమె ఇదే పనిచేయడంతో ఆ పిల్లలు అస్వస్థకు గురయ్యారు.
దీంతో వారిని ఆసుపత్రికి తరలించింది. అక్కడి డాక్టర్లు అసలేమైంది అని తల్లిని ప్రశ్నించగా అసలు విషయం బయట పడింది. రోజూ ఉదయాన్నే మన మూత్రం మనమే తాగితే కరోనా రాదని వాట్సాప్ లో రాగా అని నిజమని భావించి అలా చేశామని ఆమె తెలిపింది. నిజానికి రోజూ వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వెబ్‌సైట్లలో వచ్చే ఫేక్ వార్తలను చూస్తూనే ఉంటాం. అవి నిజమని నమ్మి చేస్తే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. అయితే ఈ ఘటన మనలాంటి దేశంలో జరిగితే ఏమో అనుకోవచ్చు, కానీ లండన్ లో జరగడం ఆశ్చర్యకరం.