తెలంగాణలో ఉపాధి హామీ పథకాన్ని ఆపాలని చూస్తున్నారు – మంత్రి ఎర్రబెల్లి

-

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రాకుండా ఆపివేసిందని ఆరోపించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. గ్రామాల అభివృద్ధికి ఆటంకాలు కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులు వాడుకుంటుంది తప్ప తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే నేడు గ్రామాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది తప్ప నిధులు ఇవ్వడం లేదన్నారు ఎర్రబెల్లి. ఆనాడు 100 అవార్డులు ఇస్తే ఒక్కటి మాత్రమే తెలంగాణకు వచ్చేదని.. కానీ ఇప్పుడు 100 ఇస్తే 99 మన రాష్ట్రంలోని గ్రామాలకు వస్తున్నాయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని సీఎం డిమాండ్ చేసినా అనుసంధానం చేయడం లేదన్నారు.

రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పొగుడుతున్నారు కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిధులు ఇవ్వడం లేదన్నారు. రైతులు కల్లాలు కడితే కట్టవద్దు అంటున్నారని.. అదే వాళ్ళ రాష్ట్రాలలో చేపలకు కల్లాలు కడుతున్నారని.. కేంద్ర ప్రభుత్వ తీరు ఇలా ఉందంటూ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ తో పాటు ఆరు రాష్ట్రాలలో ఉపాధి హామీ పథకాన్ని ఆపివేశారని.. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉపాధి హామీ పథకాన్ని ఆపివేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news