BREAKING : ఎంసెట్ పరీక్ష తేదీలు మార్పులు…

-

ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థుల అభిరుచిని బట్టి… కొందరు డిగ్రీ కోర్సులు తీసుకుంటారు, మరికొందరు ఇంజనీరింగ్ మరియు ఇంకొందరు డాక్టర్ కావాలని అనుకుంటూ ఆ దిశగా తమ ప్రణాళికలు రచించుకుంటారు. అందులో భాగంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించనున్న ఎంసెట్ పరీక్షల్లో మార్పు చేసినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే ఇందుకు కారణం ఏమిటా అని చూస్తే తెలంగాణాలో జరగనున్న నీట్ యూజీ మరియు TSPSC పరీక్షల వలనే అన్నది స్పష్టంగా తెలుస్తోంది.

అయితే ఇంతకు ముందు షెడ్యూల్ ప్రకారం ఎంసెట్ పరీక్షలు మే 7, 8 మరియు 9వ తేదీలలో జరగాల్సి ఉంది. కానీ మార్చిన షెడ్యూల్ ప్రకారం మే 12, 13 మరియు 14 తేదీలలో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. కానీ ఎంసెట్ అగ్రికల్చర్ మరియు ఫార్మసీ పరీక్షలు మాత్రం ముందు నిర్ణయించిన తేదీలలో మాత్రమే జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news