న్యూయార్క్ లోని అతిపెద్ద స్క్రీన్ పై రామ్ మందిర్ భూమి పూజ వేడుకల ప్రసారం..!

-

అయోధ్యలో ఆగస్టు 5వ తేదీన రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగనున్న వేడుకతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల దశాబ్దాల కల ఆగస్ట్ 5వ తేదీన నిజంకాబోతోంది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌ లోని టైమ్‌ స్క్వేర్‌‌లో బిల్‌బోర్డ్స్‌ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌ లో డిస్‌ప్లే చేయనున్నారు.

హిందీ, ఇంగ్లిష్ లో ‘జై శ్రీ రామ్’ అనే పదాల చిత్రాలు, శ్రీరాముడి చిత్రాలు, వీడియోలు, ఆలయ రూపకల్పన, వాస్తుశిల్పం యొక్క 3 డీ పోర్ట్‌రైట్స్‌ తోపాటు ప్రధాని మోదీ ఆలయానికి పునాదిరాయి వేసే చిత్రాలను టైమ్స్ లోని బిల్ బోర్డులలో ప్రదర్శించనున్నారు. ఈ ప్రసారాలు ఆగస్టు 5 న ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు జరుగనున్నాయి. అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జగదీశ్‌ శివ్హనీ అన్నారు. ఇండియన్‌ కమ్యూనిటీకి చెందిన వారు ఆరోజు అక్కడ గ్యాదర్‌‌ అవుతారని, ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news