జాగ్రత్త! మీరు ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా?

-

ఎండాకాలం రాగానే ఏసీకి ఉన్న బూజు దులపడం సాధరణం. ఈ కాలంలో కూలింగ్‌లో ఉండటాన్ని మన శరీరం కోరుకుంటుంది. కానీ, ఈ ఎయిర్‌ కూలింగ్‌ ద్వారా మనకు వచ్చే సమస్యలేంటో చూద్దాం. ఈ ఏసీలు ముఖ్యంగా ప్రభుత్వ ఆఫీసుల్లో మామూలు సమయల్లో కూడా చాలామంది ఉన్నారు.ప్రైవేటు కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ ఆఫీస్‌లలో ఈ ఏసీల వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల సమాన్య ప్రజలు కూడా ఏసీలకు బాగా అలవాటు పడిపోతున్నారు.

చివరికి బస్సు ప్రయాణం చేస్తే బయట నుంచి గాలి వస్తున్న ఏసీ బస్సులకే అలవాటు పడిపోతున్నారు. అటువంటి చల్లదనం సహజసిద్ధమైంది కాదు. దానివల్ల ఎన్నో నష్టాలు కలుగుతాయి. అందువల్ల కళ్లకు దురదలు, మంటల వంటి సమస్యలు వస్తాయి. వీటికి ప్రధాన కారణం ఏసీలో ఎక్కువసేపు ఉండటం. కళ్లు పొడిబారే సమస్య ఉన్నవారు ఏసీలకు దూరంగా ఉండటం మేలు.

ఏసీల వల్ల కలిగే నష్టాలు

ఏసీలు వేయగానే డోర్‌లు మూసేస్తాం. దీనివల్ల మన నుంచి వెళ్లే కార్బన్‌ డై ఆక్సైడ్‌ మనమే పీల్చుతాం. ఆక్సిజన్‌ తక్కువ అయి తలనొప్పి వస్తుంది. దీన్ని నిర్లక్షం చేస్తే మైగ్రేన్‌కు దారి తీస్తుంది. ఇది మన తలను బద్దలు చేస్తుంది.
ఏసీ వల్ల రక్తంలో ఆక్సిజన్‌ తక్కువై శరీరం త్వరగా ఆలసిపోతుంది. లోబీపీ వస్తుంది.

డీహైడ్రేషన్‌తో జాగ్రత్త!

ఏసీ చల్లదనం వల్ల డీహైడ్రెషన్‌కి చేరుకుంటాం. దీనికి ఎక్కువ నీరు తాగాల్సి వస్తుంది. ఏసీ లో ఉండేవారు ఎక్కువ శాతం నీరు తాగకపోవచ్చు. దీనివల్ల వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
ఏసీ వల్ల చర్మం డ్రై అవుతుంది. ఇక దానికి రకరకాల క్రీములు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. ముక్కు, గొంతు, కళ్లు దెబ్బతింటాయి. గొంతులో గరగర ఉంటుంది. ముక్కు దిబ్బడ, వైరల్‌ అలర్జీలే ఎక్కువ వస్తాయి.
ఆస్తమా వంటి సమస్యలు మనకు ఏ అనారోగ్యం లేనంత కాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆస్తమా వచ్చిందంటే అవి ఒక పట్టానపోవు. ఎన్ని మందులు వాడినా తగ్గవు. వీలైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండటమే మేలు. నీరసం, నిస్సత్తువ వస్తుంది. ఈ కృత్రిమ చల్లదనాన్ని ఇచ్చేవే కాబట్టి ఏసీలకు దూరంగా ఉండాలి.

విషపూరితం

ఏసీల వల్ల మరో సమస్య ఎలుకలు సెంట్రల్‌ ఏసీల్లో గూడు కట్టుకుంటాయి. వ్యర్థాలను అక్కడే తింటాయి. ఫలితంగా ఏసీల్లో వాతావరణం విషపూరితం అవుతుంది. మనకు రకరకాల వ్యాధులు వస్తాయి. నెలకోసారి అయినా ఏసీలను క్లీన్‌ చేయాలి. అందుకే ఎక్కువ సేపు బయటి వాతావరణం పై ఆధారపడాలి. కిటికీలు, డోర్‌లు తెరిచిపెట్టాలి. సాధ్యమైనంత వరకు ఏసీలకు దూరంగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news