దానికి నో చెప్పిందని ప్రియుడు దారుణం..!

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. కె ఆర్ పురం అనుగొండనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యువతీ యువకులు విగతజీవులుగా కనిపించారు. అయితే వారిని ఉష.. గోపాలకృష్ణ గా పోలీసులు నిర్ధారించారు. యువతిని హత్య చేసి ఆ తర్వాత యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉషా గోపాలకృష్ణ మధ్య కొంత కాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని పలుమార్లు యువతిని కోరినట్టు తెలుస్తోంది.

ఈమధ్య పెళ్లి చేసుకోవాలని వేధింపులు కూడా ఎక్కువ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మాట్లాడాలి అని చెప్పి ఉషా ను స్థానిక చెరువు వద్దకు పిలిపించాడు. మాట్లాడుతున్న క్రమంలో కోపానికి గురై ఆమె గొంతు నలిపి హత్య చేసాడు. తర్వాత యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి విచారణ జరుపుతున్నారు.