అంతర్జాతీయ ప్రయాణికులపై కర్ణాటక ఆంక్షలు

-

కర్ణాటక రాష్ట్రాన్ని కరోనా కొత్త రకం వైరస్ భయపెడుతోంది. కొత్త వేరియంట్ ఏ.వై 4.2 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. కొన్ని పాశ్చాత్య దేశాల్లో కరోనా కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి. దీంతో కర్ణాటక రాష్ట్రానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పని సరిగా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ చూపించాలని నిబంధనలు విధించింది. ప్రయాణానికి ముందు 72 గంటల లోపు చేయించుకున్న టెస్ట్ రిజల్ట్ ను ఏయిర్ సువిధ వెబ్ సైట్ లో ఆప్ లోడ్ చేయాల్సిందిగా అధికారులు తెలిపారు. ఒక వేళ ఫేక్ రిపోర్టులను సబ్మిట్ చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. విమానాశ్రయంలో కేవలం లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని, ప్రయాణికులు విధిగా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. స్క్రీనింగ్ టెస్ట్ లో లక్షణాలు బయటపడితే వెంటనే సదరు వ్యక్తిని ఐసోలేషన్ లోకి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. హై రిస్క్ ఉన్న యూరప్, యూకే, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోట్వ్సానా, చైనా, మారిషస్, సౌత్ ఆఫ్రికా, జింబ్వాబే, న్యూజీలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ప్రయాణానంతరం కూడా అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news