ప్రియురాలితో న్యూడ్‌ కాల్స్‌..అది కావాలని ప్రియుడి టార్చర్‌..చివరికీ !

-

ప్రియురాలితో అక్రమ సంబంధం పెట్టుకుని..పెళ్లి చేసుకోవాలని ప్రియుడు టార్చర్‌ పెట్టాడు. దీంతో విసిగి పోయిన ప్రియురాలు.. అతన్ని మర్డర్‌ చేయించింది. ఈ సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే…. మీర్పేట్ ప్రశాంతి హిల్స్ లో నివాసం ఉండే శ్వేతారెడ్డి ఫేస్ బుక్ లో పరిచయం అయినా మల్కారం యాష్మ కుమార్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ప్రేమికుడితో తరుచుగా న్యూడ్ కాల్స్ మాట్లాడింది శ్వేతా.. అయితే.. న్యూడ్ కాల్స్ ని రికార్డ్ చేసిన ప్రియుడు యాష్మ కుమార్.. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు.

అయితే.. శ్వేతా రెడ్డి పెళ్లికి ఒప్పుకోకపోతే బందువులకు వీడియోలు పంపిస్తానని బెదిరింపులకు దిగాడు మల్కారం యాష్మ కుమార్. దీంతో పథకం ప్రకారం ప్రియుడిని హత్య చేసింది మహిళ. హత్య చేసి రోడ్డు యాక్సిడెంట్ గా చిత్రీకరించింది మహిళ. అయితే.. ఈ కేసులో నిందితురాలిని తాజాగా అరెస్ట్ చేశారు మీర్పేట్ పోలీసులు. హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్, రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news