గూగుల్ పే నుంచి ఈ మెసేజ్ వస్తుందా…?

-

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా పోలీసు శాఖ పక్కా చర్యలు చేపడుతుంది. అనవసరంగా బయటకు వస్తే తాట తీయడానికి రెడీ అయ్యారు. దీనితో నగదు లావాదేవీలు ఆగిపోవడం, జనాలకు పనులు లేకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో కొంత మంది కేటుగాళ్ళు కొత్త స్కెచ్ లు వేస్తున్నారు.

ప్రజల ఆర్ధిక కష్టాలను తమకు అనువుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం కొత్త మార్గాలను వాళ్ళు అన్వేషిస్తున్నారు. గూగుల్ పే నుంచి ఒక లింక్ వైరల్ అవుతుంది. ఆ లింక్ ని సైబర్ నేరగాళ్ళు తయారు చేసారు. దాన్ని స్క్రాచ్ చేస్తే మీకు డబ్బులు వస్తాయి. వెయ్యి నుంచి 10 వేల వరకు డబ్బులు వస్తాయి. అలాగే మీకు గూగుల్ పే డబ్బులతో పాటుగా… సరుకులను కూడా మీ ఇంటికి పంపిస్తుంది.

దీన్ని చాలా మంది ఆర్ధిక కష్టాలు కాస్త అయినా తీరే అవకాశం ఉందని క్లిక్ చేస్తున్నారు. దీనితో బ్యాంకు ఖాతాల్లో ఉండే డబ్బులు భారీగా పోతున్నాయి. వెయ్యి రూపాయలకు కక్కుర్తి పడి ప్రజలు లక్షల వరకు పోగొట్టుకుంటున్నారు. ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే మీ ఫోన్ లో ఉన్న బ్యాంకింగ్ సమాచారం వాళ్లకు వెళ్తుంది. దీనితో వాళ్ళు మీ బ్యాంకు లో నగదు కోసం కొన్ని ప్రత్యేక మెసేజ్ లు పంపి నగదు కాజేస్తారు. కాబట్టి ఏ లింక్ ని క్లిక్ చేయకుండా ఉంటే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news