చాలా మందికి సొంత ఇల్లు నిర్మించుకోవడం అనేది ఓ కల. ఎప్పటి నుండో ఇల్లు కట్టాలని చాలా మంది అనుకుంటూ వుంటారు. కానీ అందరికీ ఆ భాగ్యం రాదు. అయితే మీరు కూడా సొంత ఇల్లుని నిర్మించుకోవాలని భావిస్తున్నారా..? ఆ కలని ఎప్పటి నుండో నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే అదిరే ఆఫర్ ఒకటి తీసుకొచ్చింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
హోమ్ లోన్ పొందాలని.. దానితో ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారు దీనిని తప్పక తెలుసుకోవాలి. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో సొంతిల్లు నిర్మించుకోవడం సులభం. హోమ్ లోన్స్‌పై 6.4 శాతం వడ్డీని ఇస్తోంది. అలానే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్ల పై ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి తగ్గించడం జరిగింది.
అయితే ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 27 అంటే ఈరోజు నుంచే వడ్డీ రేట్లు అమలు లోకి రావడం జరిగింది. మీరు కనుక ఈ హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే ఈ వడ్డీ రేటుతో లోన్ వస్తుంది. హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలని భావించే వారికి కూడా ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఇది పండుగ సీజన్ కనుక బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల హోమ్ లోన్ తీసుకుంటే బెనిఫిట్ గా ఉంటుంది. అలానే రిలీఫ్ గా ఉంటుంది.