కెనడా రక్షణ మంత్రిగా భారతీయ మూలాలున్న మహిళ అనితా ఆనంద్

కెనడాలో భారతీయ మూలాలున్న మహిళ కు అరుదైన గౌరవం లభించింది. ఏకంగా కెనడా రక్షణ మంత్రి పదవి లభించింది. కెనడా రక్షణ మంత్రిగా 54 ఏళ్ల అనితా ఆనంద్ నియమించబడ్డారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంత్రి వర్గంలో రక్షణ మంత్రిగా అనితా ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో రక్షణమంత్రిగా ఉన్న హర్జీత్ సజ్జన్ స్థానంలో అనితా ఆనంద్ నియమించబడ్డారు. జస్టిన్ ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి గత సెప్టెంబర్ లో తిరిగి అధికారంలోకి వచ్చారు. 

ప్రస్తుతం రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనితా ఆనంద్ కార్పోరేట్ లాయర్ గా బలమైన నేపథ్యం ఉంది. కోవిడ్ పాండమిక్ సమయంలో అనితా కీలకంగా వ్యవహరించారు. వ్యాక్సిన్ల సేకరణ సమయంలో తన ముద్రను చాటుకున్నారు. ప్రొక్యూర్ మెంట్ మంత్రిగా ఉంటూ కీలకంగా వ్యవహరించారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనితా ఆనంద్, కెనడా ప్రజలు భద్రతా బలగాల రక్షణలో సురక్షితంగా ఉన్నారనే భావనను కలుగ చేస్తానని అన్నారు.