ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్‌ పార్టీ ఎంట్రీ : సీపీఐ సెటైర్లు

-

ప్లీనరీ సమావేశంలో సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ. ఏపీలో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేస్తామనడం విడురంగా వుందని… ఏపికి నీళ్ళు ఇవ్వదని చెబుతూ టిఆర్ఎస్ ని ఎలా పెడుతావని ప్రశ్నించారు సీపీఐ రామకృష్ణ… సీఎం కెసిఆర్ పగటి కలలు మానుకోవాలని చురకలు అంటించారు సిపిఐ రామకృష్ణ.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటి పడి నిత్యావసర ధరలు పెంచుతున్నాయని… విద్యుత్ చార్జీల, పెట్రోల్ డీజిల్ రోజు రోజుకు పెరుగుతున్నాయని నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రోజు నిత్యావసర ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించలేదు. రైల్వే ఛార్జీలూ పెంచారని మండిపడ్డారు.

ఏపీలో సీఎం జగన్ ఆస్తి పన్ను, చెత్త పన్ను, విద్యుత్ చార్జీలను పెంచారని.. ఫైర్‌ అయ్యారు రామకృష్ణ. 28 వ తేదీన నిరసన దీక్షలు చేపడుతున్నామని.. విద్యా రంగాన్ని సీఎం జగన్ రోడ్డు పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ ఒడి ని ఏగగొట్టేందుకు జగన్ చర్యలు చేపట్టారని నిప్పులు చెరిగారు. కాగా.. మొన్న  జరిగిన ప్లీనరీ సమావేశంలో ఏపీ రాజకీయాలపై సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  ఏపీలో పార్టీ పెట్టాలని ప్రతిపాదనలు వస్తున్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news