అక్కడ ‘3డీ’లో ఇల్లు కట్టారంటా..!

-

ఎల్‌ అండ్‌ టీకి చెందిన నిర్మాణ సంస్థ కాంచీపురంలో తన ప్లాంట్‌ ఆవరణలో 3డీ ప్రింటింగ్‌ సాంకేతిక సాయంతో జీ+వన్‌ భవనాన్ని నిర్మించింది. 700 చదరపు అడుగుల స్థలంలో సొంతంగా తయారు చేసిన కాంక్రీట్‌ మిక్స్‌తో దేశంలోనే మొదటిసారిగా 3డీ ప్రింటింగ్‌ భవనాన్ని నిర్మించింది. ఇది సాంకేతిక విప్లవాల్లో ఒక్కటి. రోబోటిక్‌ నిర్మాణ సరిహద్దులను విస్తరింపజేస్తుంది. వెల్‌డెడ్‌ మెష్‌తో సాయంతో వర్టీకల్‌ రీఇన్‌ఫోర్స్‌మెంట్‌ బార్‌తో పాటు హారిజాంటల్‌ డిస్ట్రీబ్యూటర్లను ఒకేసారి ప్రింట్‌ చేయడంతోనే సాధ్యమైనట్లు సంస్థ తెలిపింది. నిర్మాణల కోసం చేస్తున్న ఖర్చులు, భవనాల్లో ఉండాల్సిన వసతులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణం చేపట్టిట్లు పేర్కొంది.

 

106 గంటలు..

హారిజాంటల్‌ స్లాబ్‌ మెంబర్స్‌ తప్పిస్తే భవన నిర్మాణం మొత్తం 3డీ ప్రింట్‌ చేశారు. ఇందుకోసం 106 గంటల సమయం కేటాయించినట్లు సంస్థ సభ్యులు తెలిపారు. ఈ ప్రక్రియలో ఒక 3డీ భవనాన్ని వరస తర్వాత వరసగా నిర్మిస్తూ ముందుకెళ్లారు.
రానున్న రెండేళ్లలో ‘అందరికీ ఇళ్లు’ అనే పథకం ద్వారా మన దేశంలో 6 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ ధ్యేయం. 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో నిర్మాణంతో వేగం, తక్కువ ఖర్చు, సమయం ఆదా ఆవుతుందని సదరు సంస్థ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news