క్రునాల్ పాండ్యా కి షాక్ ఇచ్చిన లక్నో….. వైస్ కెప్టెన్‌గా విండీస్ చిచ్చరపిడుగు

-

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది. దాంతో, అన్ని ఫ్రాంచైజీలు టైటిల్ వేట కోసం వివిధ వ్యూహాలను రచిస్తున్నాయి . ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా కు పెద్ద షాక్ ఇచ్చింది.కృనాల్ పాండ్యా ను కాదని వెస్టిండీస్ చిచ్చరపిడుగు నికోలస్ పూరన్‌ కు వైస్ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించింది.కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్ కలిసి ఉన్న ఫొటోను లక్నో మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అందులో ఈ స్టార్ ప్లేయర్స్ ఇద్దరు లక్నో జెర్సీతో పోజిచ్చారు. దానికి రాహుల్, పూరన్ ఈ సీజన్ ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఐపీఎల్ 16వ సీజన్‌లో గాయపడి టోర్నీ మొత్తానికి రాహుల్ దూరం కావడంతో ,వైస్ కెప్టెన్‌గా ఉన్న కృనాల్ పాండ్యా సారథిగా జట్టును నడిపించాడు. లక్నోను ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లినప్పటికీ నాకౌట్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో చేజేతులా ఓటమి పాలైంది. మరోవైపు.. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో పూరన్ బ్యాటర్‌గా, కెప్టెన్ గా రాణించి ఎంఐ ఎమిరేట్స్‌ను తొలిసారి చాంపియన్‌గా నిలిపాడు.అందుకనే 17వ సీజన్‌లో లక్నో పూరన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

Read more RELATED
Recommended to you

Latest news