సమ్మర్‌లో రేగిపండ్లతో ఈ వెరైటీస్‌ ట్రై చేయండి

-

రేగుపండ్లు సమ్మర్‌లో బాగా దొరుకుతాయి.. వీటితో రోటి పచ్చడి నూరొచ్చు, ఊరగాయ పెట్టొచ్చు. వడలు, కేక్స్‌.. ఇలా నోరూరించే వంటకాలెన్నో చేయొచ్చు. ఈ సమ్మర్‌లో మిమ్మల్ని హెడ్రేట్‌గా ఉంచుతాయి. జూజూబ్‌ థండర్‌, స్వీట్‌ స్పైసీ పికిల్‌ ఎలా చేయాలో తెలుసుకుందాం..

జూజూబ్‌ థండర్‌

కావలసినవి: రేగుపండ్లు – కప్పు,
పంచదార – పావు కప్పు,
అల్లం – అంగుళం ముక్క,
దాల్చినచెక్క – రెండు అంగుళాల ముక్క,
నీళ్లు – 3 గ్లాసులు,
ఐస్‌ క్యూబ్స్‌ – 6

తయారీ :

పండ్లను కడిగి, తొడిమెలు, గింజలు తీసేసి, నీళ్లలో వేయాలి. అందులో చిన్న ముక్కలుగా కట్‌ చేసిన అల్లం, దాల్చినచెక్క వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత పంచదార వేసి.. బ్లెండ్‌ చేయాలి. గ్లాసుల్లో పోసి, ఐస్‌ క్యూబ్స్‌ జతచేసి.. తాగడమే..

స్వీట్‌ స్పైసీ పికిల్‌

కావలసినవి: రేగుపండ్లు – కప్పున్నర,
బెల్లం – ముప్పావు కప్పు,
ఆవనూనె – 4 చెంచాలు,
జీలకర్ర, నల్ల జీలకర్ర (కలోంజీ),
సోంపు, ఆవాలు – చెంచా చొప్పున,
మెంతులు, వాము, కారం, ధనియాల పొడి – అర చెంచా చొప్పున,
లవంగాలు – నాలుగైదు,
మిరియాలు – ముప్పావు చెంచా,
ఎండు మిరపకాయలు – 3,
ఉప్పు – పావు చెంచా

తయారీ :

రేగుపండ్లు కడిగి, తొడిమెలు తీసేసి, మూడు గంటలు ఎండబెట్టండి. జీలకర్ర, సోంపు, మెంతులు, లవంగాలు, మిరియాలను సన్న సెగ మీద రెండు మూడు నిమిషాలు వేయించండి. కచ్చాపచ్చా నూరాలి. బెల్లంలో మూడు చెంచాల నీళ్లు పోసి.. వేడిచేయాలి. కాస్త కరిగాక.. రేగుపండ్లు వేసి, కలియ తిప్పుతూ పాకం వాటికి పట్టిందనుకున్నాక దించాలి. కడాయిలో నూనె వేసి నల్ల జీలకర్ర, ఎండు మిరపకాయలు, నూరి సిద్ధంచేసిన దినుసుల పొడి, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి వేయించాలి. రెండు నిమిషాల తర్వాత పాకం పట్టిన రేగుపండ్లను వేసి కలియ తిప్పాలి. అంతే.. నోరూరించే ‘స్వీట్‌ స్పైసీ జూజూబ్‌ పికిల్‌’ రెడీ. చల్లారిన తర్వాత తడి లేని సీసాలో భద్రంచేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news