BREAKING : ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన లుఫ్తాన్సా విమానాలు

-

ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. సాంకేతిక లోపం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ విమానాలు నిలిచిపోయాయి. ‘‘ఐటీ వ్యవస్థలో వైఫల్యం కారణంగా ఈ సమస్య ఏర్పడింది’’ అని కంపెనీ వెల్లడించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని కంపెనీ తెలిపింది.

సాంకేతిక లోపం కారణంగా ప్రస్తుతానికి విమానాలన్నీ ఎయిర్‌పోర్టులకే పరిమితమయ్యాయని లుఫ్తాన్సా వెల్లడించింది. ఇప్పటికే టేకాఫ్‌ అయిన విమానాలను సమీపంలోని ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్‌ చేయమని చెప్పారా లేదా అన్న వివరాలు ఇంకా తెలియలేదు. లుఫ్తాన్సా విమానాల రద్దుతో పలు దేశాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ఎయిర్‌పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news