Manchu Vishnu: ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు స్వీకారం.. ఆ ఫైలు పై తొలి సంతకం

-

Manchu Vishnu: మునుపెన్నడూ లేని విధంగా ఈసారి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు చాలా ఉత్కంఠను రేపాయి. ఈ పోరులో ప్ర‌కాశ్ రాజ్‌పై మంచువిష్ణు ఘ‌న విజ‌యం సాధించారు. అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్నాడు. అయినా.. రోజుకో ట్విస్ట్‌ తెరమీదకి వస్తుంది.

ప్రకాశ్‌రాజ్‌, నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయడం, అనంతరం ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్ సభ్యులు కూడా మూకుమ్మడిగా రాజీనామాలు. ఇలా పలు నాటకీయ పరిణామాల మ‌ధ్య మా ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు.

ప్ర‌స్తుతం ఆయ‌న ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుల రాజీనామాలను ఆమోదిస్తారా? లేదా? అన్నది చ‌ర్చ‌నీయంగా ఉంది. సాధారణంగా మా అసోసియేషన్‌లో ఏదైనా ఒక పదవి ఖాళీ ఏర్పడితే, దాన్ని భర్తీ చేసే అధికారి మా అధ్యక్షుడికే ఉంటుంది.

ఈ క్రమంలో మా నూత‌న అధ్య‌క్షడైనా.. మంచు విష్ణు త‌న సంత‌కాన్ని పెన్షన్‌ ఫైల్ పై చేసింది. పెద్ద మనుషుల ద్వారా సర్ది చెప్పించి.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులను కలుపుకుపోతారా లేక.. ‘మా’ బైలాస్‌కి అనుగుణంగా కొత్తవాళ్లని వారి ప్లేసుల్లో రిప్లేస్ చేస్తారా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news