టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ ఖరారు…

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు షెడ్యూల్ ను విడుదల చేసింది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుణ్ని ఎన్నుకోవడం అనవాయితీ. అయితే గత ఎప్రిల్ లో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగాల్సి ఉన్నా… కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్ష ఎన్నిక తేదీలను ప్రకటిచారు. ఈనెల అక్టోబర్ 17న పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదలవుతందని, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణకూడా జరుగుతుందని కేటీఆర్ వెల్లడించారు.

 అక్టోబర్ 22 తేదీ పాటు వరసగా ఆరు రోజులు నామినేషన్లకు గడువు ఉంటుందన్నారు పార్టీ పనితీరుపై చర్చ, తీర్మాణాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు అధ్యక్షత వహిస్తారని తెలిపారు.