మగవాళ్ళు కూడా… ముండమోపుల్లా ఏడుస్తున్నారు : నరేష్ కౌంటర్

మా అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వేడి ఏమాత్రం తగ్గటం లేదు. పరస్పర ప్రెస్మీట్ లతో ఒకరిపై ఒకరు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూన్నారు. ఇక తాజాగా ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు నటుడు నరేష్. మంచు విష్ణు ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే… బాగోదని హెచ్చరించారు నరేష్. ఆయనను ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలని సూచనలు చేశారు. ఎమోషన్స్.. ఫ్రస్ట్రేషన్… వద్దు ఇక వద్దన్నారు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు… కానీ.. గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి ? అని ఫైర్ అయ్యారు నరేష్. ఫ్యాక్షనిజం మానేద్దాం… కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ప్రమాణ స్వీకారం త్వరలో ప్రకటిస్తాం… ఇవాళ నేను ఛార్జ్ విష్ణు కి ఇచ్చానన్నారు. రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుందని.. ఓడినా, గెలిచినా కలిసి పనిచేస్తాం అన్నారు… మరి ఇప్పుడేమైందని నిప్పులు చెరిగారు. మగవాళ్ళు కూడా… ఈరోజు ముండమోపుల్లా ఏడుస్తున్నారని నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కలిసి పనిచేస్తామన్న వాళ్ళు… ఎందుకు రిజైన్ చేశారు.. బయట ఉండి ప్రశ్నించడం ఏంటి…? అని ప్రకాష్ రాజు ప్యానల్ సభ్యులకు కౌంటర్ ఇచ్చాడు నటుడు నరేష్. మోడీ గెలిచాడు అని… కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్ళలేదు కదా..! అని ఎద్దేవా చేశారు. మా అనేది కుటుంబమని.. గెస్ట్ గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారని మండిపడ్డారు.