ఎంటి బాస్.. బిగ్ బాస్ షో మంచిగా నడుస్తుందా..? ఎమైనా తేడా కొట్టేస్తుందా..? ఎమిలేదు ఈ సీజన్ చూస్తుంటే మీకేదో భయం పట్టుకున్నట్లు కనిపిస్తుంది బ్రో. ఏదైనా పర్సనల్ పనిమీద బైట తిరుగుతున్నావా ఎంది..? ఏఏఏ తప్పుగా అనుకోకు బ్రో.. ఇట్స్ జస్ట్ మై ఒపినీయన్.. బికాజ్ ది షో యు ఆర్ రన్నింగ్ ఇజ్.. ఓహ్ సారీ బ్రో ఈ మధ్య నీ షో ఫాలో అవుతున్నా అందుకే ఇంగ్లీష్ అలా తన్నుకుంటా వస్తాంది. మా ఇంట్లోవాళ్లు కుడా నన్ను ఏకేస్తున్నారు.. ఏరా ఏం మాట్లాడుతున్నావ్ అని.. ఏంటా అని అడిగితే నువ్వు మాట్లాడేది తెలుగా.. తమిలమా.. ఇంకేదైనానా అంటూ చెబుతున్నారు..
ఏందిరా ఇది.. నాకేమైందా అని ఆలోచిస్తాంటే (ఆలోచిస్తుంటే).. అప్పుడుదా అర్థమైనది.. నా భాష కిచిడి అపోనాదని.. లివ్ ఇట్ బ్రో .. ఇంకా ఏంటి సంగతులు.. అసలు విషయం చెప్పనేలేదు.. ఏంటి ఏమైనా టెన్షన్ పడుతున్నావా..? షో బాగానే ఉందా..
వై యు ఆర్ ఆస్కింగ్ దిస్ మ్యాన్.. సబ్ టీక్ హై.. టీఆర్‌పీ దా బాగానే ఉండాది.. నాను చాలా హ్యాపీ..
హలో హలో బిగ్ బాస్ బ్రదరు.. “తెలుగు తెలుగు”.. తెలుగులో మాట్లాడు బ్రదర్.. నువ్వు వారి దారిలోనే వెళ్తున్నావ్
సరే మేటర్‌లోకి వచ్చేస్తా.. ఏంటి బాస్ ఈ సీజన్‌లో నీ కమాండ్ బాగా తగ్గినట్టుంది. హౌస్‌లో ట్లు ఇష్టానుసారంగా ఉంటున్నారు. తెలుగు క్లియర్‌గా మాట్లాడేవారు ఓ ముగ్గురు తప్ప అందరూ కిచిడీ బాషలోనే మాట్లాడుతున్నారు. నువ్వైనా వారిని తెలుగులో మాట్లాడమని చెప్పట్లేదు.. మన షోని దేశమంతా చూస్తున్నట్లుగా వదిలేస్తున్నావ్.. మరీ కష్టంగా ఉంది బాస్.. తెలుగు బాష యాస అంటూ అందరూ తెలుగు కోసం పోరాడుతుంటే.. నువ్వేమో వాళ్లనలా వదిలేసి తెలుగుకు తెగులు పట్టిస్తున్నావ్..?? నిజం చెప్పు నువ్వు ఫుల్ బిజీ కదా..?? ఆరోగ్య సమస్య ఏమైనా వచ్చిందా.. జలుబు, దగ్గు లాంటివేమైనా ఇబ్బంది పెడుతున్నాయా?? క్వారంటైన్‌లోగానీ ఉన్నావా..?? కషాయం, పారాసిటమాల్ లాంటివి వాడు.. లేక అలిగి ఇంట్ల కూర్చున్నావా..? అని సర్దుకుంటైగానీ పనిలోకి వచ్చెయ్ లేకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది మరి.
వచ్చాక ఇవి చూడు కొంచెం.. రియాలిటీకి ప్రయారిటీ ఇవ్వు.. మన ట్యాగ్ లైన్ అదే కదా.. బిగ్గెస్ట్ రియాలిటీ షో అని… రియాలిటీ తగ్గిపోయి యాక్షన్, కట్ అన్నట్లు ఉంది బ్రో.. నొచ్చుకోకే.. నీ మేలు కోరుకునే వాన్ని కదా.. అందుకే ఇంతలా చెబుతున్నా.. సరే తొందరగా వచ్చి షోను జర దారిల పెట్టు.. లేకపోతే నేను కూడా షోను చూడలేను బ్రో.. నా బాష.. కిచిడి కిచిడి అయిపోతాదేమో.. నీ ఇష్టం బాసు.. నాకు తోచింది చెప్పిన వింటవో.. పంటవో నీ ఇష్టం..
– మీ మాలోకం