డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న రియా చక్రవర్తిని నార్కోటిక్స్ సెంట్రల్ బ్యూరో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఐతే రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ని తిరస్కరిస్తూ ముంబై సెషన్స్ కోర్టు నిర్ణయం తీసుకుంది. మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి.. ఇద్దరికీ బెయిల్ ఇచ్చేందుకు ముంబై సెషన్స్ కోర్ట్ నిరాకరించింది.
ఈ మేరకు నార్కోటిక్స్ బ్యూరో, రియాచక్రవర్తి కి ఉన్న పాపులారిటీ వల్ల, సమాజాంలో తనకున్న హోదా, డబ్బు కారణంగా సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడంలో రియా చక్రవర్తి తన క్రెడిట్ కార్డుని వాడిందంటూ ఎన్సీబీ పేర్కొంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకుందనీ, ఎలాంటి బలవంతం జరగలేదని ఎన్సీబీ కోర్టుకి తెలియజేసింది.