నిండుకుండలా మేడిగడ్డ.. ఎలాంటి ప్రమాదం లేదు..!

-

లక్ష్మీ బ్యారేజి  కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ. గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా లక్ష్మీ బ్యారేజి నిర్మించబడింది. దీని పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు. 2016 మే 2న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి నది నుంచి 160 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 16,50,000 ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా కరీంనగర్ జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి రివర్స్‌ పంపింగ్‌ విధానం ద్వారా నీటిని ఎత్తిపోయడానికి డిజైన్‌ చేశారు.

ఈ బ్యారేజ్ పై ఇప్పటికే కుంగిపోయిందని.. కూలిపోయింది అన్న తప్పుడు వార్తలు పటాపంచలు చేస్తూ నిండు కుండలా మారింది మేడిగడ్డ ప్రాజెక్ట్. తాజాగా  +92.40 /100.00 M లెవెల్ లో వాటర్ నిండి ఉన్నాయి.  టోటల్ ఇన్ఫ్లో/ఔట్ ఫ్లో: 3,40,00/3,41,000 క్యూసెక్కులు ఉండటం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news