సాధారణంగా చాలా మంది టాటూలు వేసుకుంటారు. కొంత మంది అధ్బుతంగా వేసుకుంటే.. మరికొందరూ వివాదాలు సృష్టిస్తుంటారు. తాజాగా ఓ టాటూ ఆర్టిస్ట్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఛాతి పై పచ్చ బొట్టు వేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ టాటూ పోలీసులను కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సుమోటోగా కళాకారుడి పై కేసు నమోదు చేశారు.
ఓ కళాకారుడు.. విదేశీయుడి ఛాతీపై ‘F**k the police’ టాటూ వేశాడు. దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. నెట్టింట వైరల్గా మారింది. ఈ పచ్చబొట్టుపై నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఫొటోను పోలీసులకు లింక్ చేస్తూ షేర్ చేశారు. మేజిస్ట్రేట్ ఆదేశాలతో పోలీసులు సుమోటాగా తీసుకుని కళాకారుడిపై కేసు నమోదు చేశారు. టాటూను చూసిన పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. పోలీసుల్ని కించపరిచేలా ఉందని.. ఉద్దేశపూర్వకంగానే అవమానించినట్లుగా ఉందని పోలీసులు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉందని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.