అన్నాడీఎంకే పగ్గాలు పళనిస్వామికే.. పన్నీరు సెల్వంకు షాక్​

-

అన్నాడీఎంకేలో ఏకనాయకత్వ వ్యవహారంలో మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు షాక్ తగిలింది. మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామికి మద్రాస్ హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. పార్టీ నాయకత్వ వివాదంపై అన్నాడీఎంకే నేత పళనిస్వామి అప్పీల్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం అనుమతించింది.

జస్టిస్ ఎం దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ జులై 11న జరిగిన ఏఐఏడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం చెల్లదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. తాజాగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతో అన్నాడీఎంకే పార్టీ పళనిస్వామి ఏక నాయకత్వంలో కొనసాగనుంది. దీంతో మాజీ ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంకు షాక్ తగిలింది.

2016లో అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరణానంతరం.. ఆ పార్టీ ద్వంద్వ నాయకత్వ సూత్రాన్ని అనుసరిస్తోంది. అయితే పళనిస్వామి మాత్రం పార్టీలో ఏక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జూన్ 14న జిల్లా కార్యదర్శి సమావేశం జరిగినప్పటి నుంచి పార్టీలో ఏక నాయకత్వం కోసం చర్చ మొదలైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news