పంచమి రోజున ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం !

-

ప్రపంచం పంచభూతాత్మికం అని అందరూ ఒప్పుకుంటారు. భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం ఇవే పంచభూతాలు. ఇవి ప్రతి మనిషిలో ఉంటాయి. బ్రహ్మాండంలో ఉంటాయి. ప్రకృతిలో సహజ సిద్ధమైన ప్రతిదీ ఈ ఐదింటి సమాహారమే అనేది సత్యం. అయితే జ్ఞానం కలిగిన మానవుడు ఆ పంచభూతాలను వాడుకుంటూ వాటికి కృతజ్ఞత తప్పనిసరిగా చూపించాలి. కానీ నేడు దీనికి విరుద్ధంగా పంచభూతాలకు హాని కలిగించేవిధంగా మానవవులు ప్రవరిస్తున్నారు. దీనివల్ల విపరీత పరిణామాలు జరుగుతున్నాయి. అయితే సనాతన ధర్మం మాత్రం ప్రకృతితో మమైకయ్య అనేక విషయాలను చెప్పింది. వాటిని ఆచరిస్తే మనకు అనేక లాభాలు కలుగుతాయి. అటువంటి వాటిలో మహాపంచమి దీపం.

ఈదీపాన్ని ఎలా పెట్టాలి అనే విషయం తెలుసుకుందాం.. ప్రతి నెలలో పౌర్ణమి, అమావాస్య వస్తుంది. ఆ తర్వాత శుక్లపక్షంలో, కృష్ణపక్షంలోనూ పంచమి తిథి వస్తుంది. సరిగ్గా ఈ తిథినాడే ఈ చిన్న తంత్రం చేయాలి. ఇంట్లో దేవుని దగ్గర పంచమి రోజున ప్రాతఃకాలంలో ఐదురకాల నూనెలతో దీపం వెలిగించి పూజించాలి. ఓం నమో మహాలక్ష్మీయైనమః తోపాటు ఓం శ్రీ పంచమీ దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఆ తర్వాత దేవునికి పండ్లు, పాయసం వంటి తీయ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కొన్ని వారాలు చేస్తే మీ ఇంట్లో జ్యేష్ఠ లక్ష్మీ పోయి మహా లక్ష్మీ వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు వస్తాయి. నమ్మకంతో విశ్వాసంతో ఈ చిన్న తంత్రాన్ని ఆచరించి ఇప్పటికే చాలా మంది లబ్ది పొందారు. మీరు ఆచరించి మంచి ఫలితాలను పొందండి.

  • కేశవ

Read more RELATED
Recommended to you

Latest news