టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కీటోడైట్‌ను పాటించవచ్చు. దాంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే హెచ్‌బీఎ1సి స్థాయిలు కూడా తగ్గుతాయి. కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్లను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.
నేటి తరుణంలో ఎక్కడ చూసినా ఆరోగ్య ప్రియులు జపిస్తున్న మంత్రం.. కీటో డైట్.. ఈ డైట్ పాటిస్తే అధిక బరువు సులభంగా తగ్గుతుందని, డయాబెటిస్ అదుపులో ఉంటుందని, ఇంకా అనేక ఇతర అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని అంటున్నారు. అందుకనే ప్రస్తుతం కీటో డైట్‌ను పాటించే వారు రోజు రోజుకీ ఎక్కువైపోతున్నారు. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కీటోడైట్ పాటించవచ్చా..? పాటిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కీటోడైట్‌ను పాటించవచ్చు. దాంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే హెచ్‌బీఎ1సి స్థాయిలు కూడా తగ్గుతాయి. కీటో డైట్‌లో కార్బొహైడ్రేట్లను చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. దీంతో ఇన్సులిన్ అవసరం పెద్దగా ఉండదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అయితే కీటో డైట్‌ను పాటించే వారు కచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలోనే ఈ డైట్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
కీటో డైట్ లో కొవ్వులు ఎక్కువగా, ప్రోటీన్లు ఒక మోస్తరుగా, కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటారు. దీంతో ఇన్సులిన్ పెద్దగా అవసరం ఉండదు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ ఎప్పటికప్పుడు ఖర్చవుతుంది. ఇక శరీరం శక్తి కోసం కీటోన్లను ఉపయోగించుకుంటుంది. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతుంటాయి. ఫలితంగా డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కనుక టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు నిరభ్యంతరంగా కీటోడైట్‌ను పాటించవచ్చు. కాకపోతే డాక్టర్ సూచన మేరకు నిర్దిష్టమైన రోజుల పాటు మాత్రమే కీటో డైట్‌ను పాటించాల్సి ఉంటుంది.
కీటో డైట్‌ను ఏ ప్రయోజనం కోసం చేసినా సరే అదనంగా మనకు మరొక లాభం కూడా ఉంటుంది. అదే వెయిట్ లాస్. కీటో డైట్ వల్ల అధిక బరువు తగ్గుతారు. దీంతో గుండె జబ్బులు, హైబీపీ రాకుండా ఉంటాయి. అయితే టైప్ 2 డయాబెటిస్ మాత్రమే కాదు, ఏ సమస్య కోసం కీటోడైట్ చేసినా సరే.. డాక్టర్ల పర్యవేక్షణ అవసరం. లేదంటే తీవ్రమైన దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక కీటోడైట్‌ను పాటించేవారు జాగ్రత్తగా ఉండాలి..!