విరాళాలపై పవన్‌కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు..మా కంటే వారి వద్దే ఎక్కువ మనీ.

హైదరాబాదల్‌లో వరదసాయం, విరాళాలపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..సినిమావాళ్ల కంటే వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల దగ్గరే డబ్బెక్కువ ఉంటుందన్నారు..రాజకీయ నాయకులు ఎన్నికల్లో పెట్టుబడిగా అయినా భావించి విరాళాలు ఇవ్వాలన్నారు పవన్ కల్యాణ్..సినిమా వాళ్లకు బయట స్టార్‌ ఫేమ్ ఉండొచ్చేమో కానీ, సంపద మాత్రం అంత ఉండదన్నారాయన. చాలా మంది అనేక రకాలైన నష్టాల్లో ఉన్నారని తెలిపారు.ఈ కరోనా వైరస్‌తో ఇంకా ఆర్థికంగా నష్టపోయారన్నారు పవన్‌.

రాజకీయ రంగంతో పోలిస్తే సినీ రంగం చాలా చిన్నదని..కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు వేలకోట్ల రుణాలు ఎగ్గొడుతున్నారని, ఇటువంటి ఆపత్కాల సమయంలో వారు సాయం చేయాల్సిన అవసరముందన్నారు పవన్..సినీ పరిశ్రమలో పేరు ఎక్కువే కాని ఆదాయం మాత్రం కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు,రాజకీయనాయకలతో చాలా తక్కువ ఉంటుందని..విపత్కర సమయంలో సాయం చేయాల్సిన బాధ్యత సినిరంగానిక చెందిన వారికంటే రాజకీయ నేతలకే ఎక్కువగా ఉందని…కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు వేలకోట్ల రుణాలు ఎగ్గొడుతున్నారని, అటువంటి వారు విరాళాలు ఇస్తే తప్పేముందన్నారు పవన్.