మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని స్టేట్ హోమ్ లో కరోన కలకలం చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త ను చంపిన కేస్ లో నిందితురాలు స్వాతి రెడ్డికి కరోన పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అదే స్టేట్ హోమ్ లో ఉంటున్న మిగతా యువతులు ఆందోళనలో మునిగిపోయారు. ఇక ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. అయితే అసలు బయటి వారెవరికి అనుమతి లోని స్టేట్ హోం లో ఉన్న వారికి కరోన సోకడం మీద అధికారులు విచారణ చేపట్టారు.
ఈమె 2017లో ప్రియుడు రాజేష్‌తో కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేయించింది. అక్కడితో ఆగక సుధాకర్ రెడ్డిని హత్య చేయించి . అతని స్థానంలోకి రాజేష్‌ను తీసుకురావడానికి యాసిడ్ దాడి నాటకం ఆడింది. ఇందుకోసం రాజేష్ తన ముఖంపై పెట్రోల్ చల్లుకుని నిప్పంటించుకున్నాడు. రాజేష్‌ను సుధాకర్ రెడ్డిగా నమ్మిస్తూ.. అతనిపై యాసిడ్ దాడి జరిగిందని స్వాతిరెడ్డి నాటకానికి తెరలేపింది. చివరికి పట్టుబడింది. అయితే కొన్నాళ్ళకి ఈ కేసులో ఆమెకు బెయిలు దొరికినా కొంతకాలంగా స్వాతిరెడ్డి కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఫిబ్రవరిలో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాగర్‌కర్నూలుకు జైలుకు తరలించారు. అక్కడి నుండి ఆమెను స్టేట్ హోంకు తరలించారు.