అజారుద్దీన్ సభ్యత్వం రద్దు.. కారణాలు ఇవే?

-

హైదరాబాద్: మాజీ క్రికెటర్, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్‌పై వేటు పడింది. హెచ్ సీఏ ఉన్న ఆయన సభ్యత్వాన్ని అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసింది. అజారుద్దీన్‌పై కేసులు పెండింగ్ ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఈనెల 2న షోకాజ్ నోటీస్ ఇచ్చారు. తాజాగా చర్యలు తీసుకున్నారు. హెచ్‌సీఏ రూల్స్ విరుద్ధంగా అజార్ నిర్ణలుంటున్నాయని అపెక్స్ కౌన్సిల్ భావించింది.

కాగా ఇటీవల కాలంలో హెచ్‌సీఏలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజారుద్దీన్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు క్రికెట్ మ్యాచ్‌లకు అభ్యర్థుల సెలెస్టింగ్ విషయంలోనూ అవకతవకలు జరగుతున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటిని అజారుద్దీన్ బీసీసీఏ అధ్యక్షుడు గంగూలీకి లేఖ రాశారు. ఈ లోపే ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇక అజారుద్దీన్ తీరుపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అజార్ కేసులకు సంబంధించి కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని గతంలో ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news