మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ నేతలు ఈసీకి లేఖలు రాశారు. 55 మంది ఎమ్మెల్యేలల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీల్లో 12 మంది తమకు మద్దతు ఉన్నారని షిండే వర్గం ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపారు.
ఈ క్రమంలో శివసేన పార్టీ లోగో తమకే చెందుతుందని షిండే వర్గం ఆరోపించింది. ఈ క్రమంలో రెండు వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. రెండు వర్గాలకు ఊహించని షాక్ ఇచ్చింది. శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించారో చెప్పే ఆధారాలు డాక్యుమెంటరీ రూపంలో తమకు నివేదికలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 8వ తేదీన డ్యాక్సుమెంట్లు సమర్పించాలని ఈసీ వెల్లడించింది. కాగా, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం లోగో ఇవ్వడం కుదరదని వాదిస్తోంది.