కన్నీళ్లు మొదట ఏ కంట్లోంచి వస్తాయో తెలుసా..? ఒక్కోదానికి ఒక్కో మీనింగ్..

-

ఆనంద వచ్చినా, బాధేసినా మనకు కంట్లోంచి నీళ్లు వస్తాయి. పట్టరాని దుఖం వచ్చినప్పుడు కచ్చితంగా ఏడ్వాలి..అప్పుడు గుండెలో భారం అంతా దిగుతుంది. లేదంటే.. మోయలేని బరువును భరిస్తూనే ఉండాలి. మనకు ఎమోషన్స్ చాలా ఉంటాయి. మన ఫీలింగ్స్‌కు తగ్గట్టు హావభావాలు పెడుతుంటాం..అలాగే కళ్లు కూడా మన ఎమోషన్‌కు తగ్గట్టు కళ్లలోంచి వచ్చే నీరు విధానం మారుతుంది. అంటే ఏడిస్తే ఒకలా, ఆనందంలో ఉంటే ఒకలా, కోపంతో ఉంటే మరోలా..! ఇది మరీ బాగుంది.. ఏమైనా..వచ్చేది నీళ్లే కదా అనుకుంటారామో.. నిజానికి మనం ఆ పర్టిక్యులర్‌ టైమ్‌లో ఎగ్జాట్గా ఏం జరుగుతుంది అనేది గమనించం.. కానీ నీళ్లు వచ్చే విధానం వేరుగా ఉంటుందట.. ఎలా అంటే..

ఎడమకంటి నుంచి ముందు నీళ్లు వస్తే..

జనరల్‌లగా ఆనందంతో వచ్చే కన్నీళ్లను ఆనందబాష్పాలు అంటారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే.. ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు మొదట వారి ఎడమ కంటి నుంచి కన్నీరు కారుతుంది.

కుడికంటి నుంచి వస్తే..

అదే ఒకవేళ ఆనందంగా ఉన్నప్పుడు అయితే ఆ వ్యక్తికి ఆనందం భాష్పాలు వచ్చినప్పుడు మొదట కుడి కంట్లో నుండి కన్నీరు వస్తుంది.

రెండు కళ్లలోంచి ఒకేసారి వస్తే..

అదే ఒకవేళ వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు మాత్రం రెండు కళ్ళలో నుండి కన్నీరు వస్తుంది. ఇలా సందర్భానికి తగ్గట్టుగా కంట్లో నుండి వచ్చే కన్నీరు కూడా వేరేగా ఉంటుంది.
క్రేజీగా ఉంది కదూ.. ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరూ పెద్దగా పట్టించుకోని ఉండరు. సెకండ్ల వ్యవధిలో ఇది జరుగుతంది. మహానటి సినిమాలో కీర్తిసూరేష్‌ ఎలా అయితే ఒక కంటిలోంచి నీళ్లు తెప్పిచిందో..అలా.. ఈసారి ఎవరైనా ఎడుస్తుంటే.. గమనించండి..! ముందు ఏ కంటిలోంచి నీళ్లు వచ్చాయా అని..! అలా అనా చూస్తూ ఊరుకోకండి.. వాళ్లు పాపం బాధలో ఉంటే ఓదార్చచండి అండీ.. ఏది ఏమైనా..కళ్లు మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పగలుగుతాయి. అందుకే ఆ దేవుడి కంటిని మాట్లేడి శక్తిని ఇవ్వలేదేమో..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version