ఎన్నికల వేళ.. సీఎంకు సుప్రీం షాక్ మూములుగా లేదుగా…!

-

రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న దేవేంద్ర ఫడ్నవిస్. తన ఐదేళ్ల పాలనను విజయవంతంగా ముగిస్తున్నారన్న పేరుతో పాటు.. తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ గెలుపొందిన తర్వాత మరోసారి సీఎం పదవి ఆయనకు ఖాయమన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ.. ఊహించని రీతిలో సుప్రీంకోర్టు నుంచి వెలువడిన ఒక ఆదేశం షాకింగ్ గా మారటమే కాదు.. దేవేంద్ర ఫడ్నవీస్ భారీ ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు. తప్పుడు అఫిడవిట్ కేసును ఆయన దాఖలు చేశారన్న ఆరోపణపై సుప్రీంకోర్టు స్పందించి.. ఆయనపై ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ 125 కింద ప్రాసిక్యూట్ చేసేందుకు ఓకే చేసింది. గతంలో ఇదే కేసులో ముంబై హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. అప్పీల్ లో భాగంగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.

2014లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన ఫడ్నవీస్.. తాను దాఖలు చేసిన అఫిడవిట్ లో తనపై ఉన్న క్రిమినల్ కేసుల్ని చేర్చలేదన్నది పిటిషన్ దారు వాదన. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్.. జస్టిస్ దీపక్ గుప్తా.. జస్టిస్ అనురుద్ధ బోస్ లతో కూడిన ధర్మాసనం ఈ రోజున విచారణ జరిపింది.తప్పుడు అఫిడవిట్ చట్టప్రకారం సరికాదని.. దిగువ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ను తాము కొట్టివేస్తున్నట్లు పేర్కంది. అదే సమయంలో ఫడ్నవీస్ మీద అభియోగాల్ని నమోదు చేయాలని ఆదేశించింది.

తాజా ఆదేశంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఫడ్నవీస్ విచారణను ఎదుర్కోవాల్సి ఉంది. కీలకమైన ఎన్నికల వేళ వెలువడిన కోర్టు ఆదేశం రాజకీయాల్లో మార్పులకు అవకాశం ఇస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరీ.. దీనిపై పార్టీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news