ఋషులు ఇలాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకొనేవారట..

-

మనుషులకు బద్ధకం ఎక్కువ అయ్యింది.దాంతో కరెక్ట్ టైం కు ఆహారాన్ని తీసుకోవడం మాట అటుంచి చేసుకోవడం కూడా మానేస్తున్నారు. మరీ ఆకలి అనిపిస్తే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు.అందుకు మన ఆరోగ్యం కూడా అరవై రాకముందే హరి అంటుంది.అప్పటి కాలంలో మునులు,ఋషులు అన్నీ ఎలా బ్రతికారు అనే విషయాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.వారి ఆరోగ్యం సీక్రెట్ కేవలం ఆహారం అని తేల్చి చెప్పారు.తినే ఆహారంలో 70 శాతం పచ్చి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి.

పచ్చి కూరగాయల జ్యూస్ ను తాగడం, తరువాత మొలకెత్తిన విత్తనాలను తినడం, సాయంత్రం పండ్లను, పండ్లతో తయారు చేసిన జ్యూస్ లను తాగడం వంటివి చాలా మంది చేస్తుంటారు. కొందరు మూడు పూటలా పచ్చి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. మరి కొందరు మధ్యాహ్నం ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా రెండు పూటలూ పచ్చి ఆహారాన్నే తీసుకుంటారు. ఇలా పచ్చి ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు, శక్తి లభించవు అనే అపోహ సరైనది కాదు అని నిపుణులు చెబుతున్నారు.

జంతువులు, ఇతర జీవులు పచ్చి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాయి.అందుకే అవి బలిష్టంగా ఉంటాయి.అనారోగ్యాల బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయని, అంతే కాకుండా పచ్చి ఆహారాన్ని తినే వారు రోజంతా చురుకుగా పని చేసుకోగలరని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా పచ్చి ఆహారాన్ని రెండు లేదా మూడు పూటలు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది.యవ్వనంతో పాటుగా మరింత అందంగా ఉంటారు. అలా తీసుకోవడం వల్ల మునులు వేల ఏళ్ళు బ్రతికారు..మీరు కూడా ఇప్పటి నుంచి అలాంటి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకొని హాయిగా జీవించండి..

Read more RELATED
Recommended to you

Latest news