రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ఆత్మహత్య కేసులో అరెస్టు చేసిన నేపథ్యంలో తీవ్ర స్థాయిలో బిజెపి నేతలు విమర్శలు చేస్తున్న నేపధ్యంలో మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సిపి నాయకుడు నవాబ్ మాలిక్ అర్నాబ్ గోస్వామి అరెస్టును “భారతదేశ మోస్ట్ వాంటెడ్ పార్ట్ 2” గా పేర్కొన్నారు. అరెస్టుతో రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.
2018 లో 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం అయిన అర్నాబ్ గోస్వామిని బుధవారం ఉదయం రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక సంజయ్ రౌత్ కూడా స్పందించారు. పోలీసులు ఆధారాలు ఉన్నాయి కాబట్టే అదుపులోకి తీసుకున్నారు అని, లేకపోతే ఎందుకు అదుపులోకి తీసుకుంటారు అని ప్రశ్నించారు. నేడు ఉదయం అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.