న్యూఢిల్లీ: భారత జాతిపిత మహత్మాగాంధీ మునుమనమరాలికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో ఆశిష్ లతా రామ్‌గోబిన్‌కు సౌతిఫ్రికాలోని దర్బాన్ కోర్టు ఈ శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో 56 ఏళ్ల ఆశిష్ లతా రామ్‌గోబిన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.
వ్యాపారదేవీల్లో భాగంగా సౌతాఫ్రికా వ్యాపార వేత్త ఎస్. మహారాజు నుంచి ఆమె ఆడ్వాన్సుగా రూ.3.3 కోట్లు తీసుకున్నారు. అయితే ఈ డబ్బులకు సుంకం చెల్లించలేదని, వ్యాపారంలో తన వాటాను కూడా చెల్లించలేదని ఆమెపై వ్యాపారవేత్త మహారాజు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో అశిష్ లతా రామ్ గోబిన్ తప్పు చేసినట్లు తేలింది. దీంతో ఆమెకు దర్బాన్ క్రైమ్ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. కాగా ఎలా గాంధీ, దివంత మేవా రామ్ గోబిన్ కుమార్తె ఆశిష్ లతా రామ్ గోబిన్.