ఇండియా: 63రోజుల తర్వాత లక్ష దిగువకు కరోనా కేసులు

-

గడిచిన 24గంటల్లో ఇండియాలో 84,498కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 63రోజుల తర్వాత లక్ష దిగువకి కేసులు రావడం ఇదే మొదటిసారి. చివరగా ఏప్రిల్ 5వ తేదీన కరోనా కేసులు లక్ష దిగువకు నమోదయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుండి పైపైకి పెరిగిన కేసులు మే 6వ తేదీన అత్యధిక మొత్తంలో 4లక్షలకి పైగా నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో 2123మంది కరోనా కారణంగా చివరి శ్వాస వదిలారు.

దాంతో మొత్తం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3,51,309కి చేరింది. 10,129కేసులతో అత్యధిక కేసులు వచ్చిన రాష్ట్రంగా మహారాష్ట నిలిచింది. ఇదిలా ఉంటే కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ, అందరికీ వ్యాక్సిన ఉచితంగా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. 18 నుండి 45ఏళ్ల లోపు వారందరికీ ఫ్రీగా వ్యాక్సిన్ వేస్తామని అన్నారు. వ్యాక్సిన్ కొనుగోలు బాధ్యతలన్నీ కేంద్రమే చూసుకుంటుందనీ, రాష్ట్రాలు ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news