మరో జీవిలోకి కరోనా వైరస్.. సవాల్ గా మారినా ఉత్పరివర్తన..!

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రపంచదేశాలు కరోనాను నిర్మూలించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయోగాలు కూడా నిర్వహిస్తున్నాయి. అయితే కరోనా కోరల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రపంచదేశాలకు మరో కొత్త సవాల్ ఎదురైంది.

కరోనా వైరస్ కారక సార్స్ కోవ్-2 వైరస్ మింక్ అనే జీవిలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో జరిగిన మార్పు (ఉత్పరివర్తన) వల్ల ఈ వైరస్ తిరిగి మనుషుల్లో ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా డెన్మార్క్ లో కనిపిస్తోంది. అందుకే అక్కడి ప్రభుత్వం పెంపకం కేంద్రాల్లోకి 1.7 కోట్ల మింక్ లను చంపేశాయి. ఈ కొత్త ఉత్పరివర్తన వల్ల భవిష్యత్ లో కరోనా కోసం అభివృద్ధి చేసిన టీకాలు నిష్ర్పయోజనమవుతాయని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ పై పరిశోధనకు నాయకత్వం వహిస్తున్న భారత సంతతి శాస్త్రవేత్త ప్రోఫెసర్ శేషాద్రి వాసన్ వైరస్ ఉత్పరివర్తనపై పలు అంశాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ లో ఉత్పరివర్తన చెందిన ఈ వైరస్ కు ‘వై453ఎఫ్’గా నామకరణం చేశామన్నారు. కరోనా అనేది ఆర్ఎన్ఏ వైరస్. ఇది వాహకాన్ని బట్టి మార్పు చెందుతూనే ఉంటుంది. దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కరోనాలో ‘డీ614జీ’ అనే ఉత్పరివర్తనతో ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. డీ614జీ వల్ల టీకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే వై453ఎఫ్ గురించి ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేమన్నారు.

కొత్త ఉత్పరివర్తన కేసులు భారత్ లో నమోదు కాలేదు. దీని వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం లేదు. వైరస్ జన్యుక్రమాలకు సంబంధించి ప్రపంచవేదిక ‘జీఐఎస్ఏఐడీ’ వద్ద ఈ నెల 12 నాటికి అందుబాటులో ఉన్న 1,97,274 కరోనా వైరస్ జన్యుక్రమాలపై తాము విశ్లేషణ జరిపామన్నారు. అందులో 387 కేసుల్లో వై453ఎఫ్ ఉత్పరివర్తన కనిపించిందన్నారు. 340 కేసులు మానవుల్లో, 42 కేసులు అమెరికన్ మింక్ లో, 5 ఐరోపా మింక్ లో కనిపించాయన్నారు. మానవుల నుంచి మింక్ లోకి ప్రవేశించి, తిరిగి మానవుల్లోకి ప్రవేశించడం వల్ల వైరస్ ఎక్కువ మార్పులకు లోనై ఉంటుందన్నారు. అయితే మనిషిలో ప్రవేశించిన కరోనా వైరస్ ఉపయోగించుకునే ‘స్పైక్ ప్రోటీన్ లోనే మార్పు జరగడం కలకలం రేపుతోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న టీకా స్పైక్ ప్రోటీన్ పై పరిశోధనలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news