SSMB28: మహేష్ బాబు విడుదలకు ముందే రికార్డులు.!

-

మహేశ్ బాబు అంటే తెలుగు పరిశ్రమ లో మామూలు సినిమా తో 100 కోట్లు వసూళ్లు రాబట్ట గల సత్తా ఉన్నోడు. ఇక తన సినిమాలు అమెరికా మార్కెట్ లో ఈజీ గా మిలియన్ డాలర్ల మార్క్ ను చేరతాయి.ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో SSMB28 వర్కింగ్ టైటిల్ పై సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా కొన్ని రోజులు కథ సెట్ కాక, మరికొన్ని రోజులు మహేశ్ బాబు కుటుంబంలో విషాదాల వల్ల బాగా లేట్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుగతోంది. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్ పేట్ సమీపంలో వున్న సారథీ స్టూడియోస్ లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా సూపర్ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే చుర కత్తుల లాంటి డైలాగ్స్ ఉండబోతున్నాయి తెలుస్తోంది.ఇందులో యంగ్ సంచలన అందం పూజా హెగ్డే శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక ఈ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. మహేష్ బాబు SSMB28 కు నైజం ఏరియా లో అదిరిపోయే ముందస్తు రేట్ వచ్చినట్లు సమాచారం.అయితే తాజాగా అందించిన సమాచారం ప్రకారం ఈ చర్చ ఇంకా నడుస్తూనే ఉందని తెలుస్తోంది. దిల్ రాజు ఈ రైట్స్ కోసం రూ.50కోట్లు ఆఫర్ చేశారని సమాచారం తెలుస్తోంది. అయితే మరోవైపు ఏషియన్ సునీల్ సిండికేట్ కూడా రూ.48కోట్లకు అడగుతున్నారని వినిపిస్తోంది. ఫైనల్ గా నైజాం ఏరియా కింగ్ దిల్ రాజు కే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news