మ‌హేష్ బాబు కూతురు చిన్న‌నాటి ఫోటోలు.. ఎంత బాగున్నాయో తెలుసా.!

-

లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌హేష్ బాబు తన పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. సితార‌, గౌత‌మ్‌ తో క‌లిసి చేసే సంద‌డికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగులతో బిజీ బిజీగా ఉండే మహేష్, ఫ్యామిలితో చాలా సంతోషం గా గడుపుతున్నారు. తాజాగా సితార‌కి సంబంధించిన చిన్న నాటి ఫోటోని న‌మ్ర‌త షేర్ చేసింది.

ఈ ఫోటోలో సితార వివిధ ర‌కాలు ఎక్స్‌ప్రెష‌న్స్ ఉన్నాయి. ఎంతో ముద్దుగా ఉన్న సితార‌ ఫోటోకి నెటిజ‌న్స్ నుండి కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా సితార త‌న తండ్రి సినిమా పాట‌ల‌కి డ్యాన్స్ చేయ‌డం లేదంటే ఫ‌న్ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్‌ని అల‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అలాగే మహేష్ బాబు కూడా కరోనా మహమ్మారి గురించి ఏదో ఒక రూపంలో హెచ్చరికలు, సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news