ఎన్టీఆర్ ని ఫాలో అవుతున్న మహేష్…! ఎందుకో తెలుసా…?

-

సినిమాల్లో రాయలసీమ యాస కు ఉండే ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రధానంగా స్టార్ హీరోలు ఆ యాస లో డైలాగులు చెప్తుంటే సినిమా చూస్తున్న అభిమానులు ఊగిపోతూ ఉంటారు. దీని కోసం కొందరు హీరోలు శిక్షణ కూడా తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ఆధారిత సినిమాల్లో దీనికి మంచి ప్రాధాన్యత ఇస్తారు హీరోలు. ఫ్యాక్షన్ ఎక్కువగా ప్రాంతం కావడంతో, యాక్షన్ సినిమాల్లో ఆ యాస కు మంచి క్రేజ్ కూడా ఉంటుంది.

ఇందులో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆరితెరిపోయాడు. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాస లోనే సినిమా మొత్తం దాదాపుగా పూర్తి చేసాడు. హీరోయిన్ దగ్గర సన్నివేశాల్లో కూడా ఆ యాసే ఎక్కువగా ఉంటుంది. దీనితో ఇప్పుడు మహేష్ బాబు సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న సినిమా సరిలేరులో అదే ప్రయత్నం చేసాడట. సినిమాకు హిట్ దక్కాలి అంటే ప్రాంతాలను కూడా యాసలో ఆకట్టుకోవాలని, అందుకు తన సినిమాలో రాయలసీమ యాస ఉండాలని కోరినట్టు సమాచారం.

కొన్ని సన్నివేశాలను రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ సీన్లలో రాయల సీమ యాసలో మాట్లాడాలని మహేష్ ప్రయత్నాలు చేసాడట. సినిమాలో అది ఒక పది నిమిషాలు ఉంటుందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. దర్శకుడు కూడా ఆ విషయంలో కాస్త ఎక్కువగానే కష్టపడినట్టు సమాచార౦. కర్నూలులో జరిగే కొన్ని సన్నివేశాల్లో అది ఉంటుందట. అది వింటే మాత్రం అభిమానులకు పూనకాలు కూడా వస్తాయని చిత్ర యూనిట్ అంటుంది. మరి కొత్త ప్రయత్నంలో మహేష్ ఎలా సక్సెస్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news