బాల‌య్య అన్ స్టాప‌బుల్ షో కు మ‌హేష్ బాబు

-

నంద‌మూరి హీరో బాల‌కృష్ణ హోస్ట్ గా ఆహా లో ప్ర‌సారం అవుతున్న అన్ స్టాప‌బుల్ అనే ఈ మ‌ధ్య కాలం లో చాలా పాపుల‌ర్ అవుతుంది. ఈ షో లో బాల‌య్య స్పీడ్ తో పాటు వ‌స్తున్న గెస్టు ల‌తో ఈ షో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్ప‌టి కే మంచు మోహ‌న్ బాబు ఫ్యామిలి తో పాటు నాని, అనిల్ రావిపూడి బ్ర‌హ్మ‌నందం తో మూడు ఎపిసోడ్ లు వ‌చ్చాయి. తాజా గా ఈ అన్ స్టాప‌బుల్ షోకు ప్రిన్స్ మ‌హేష్ బాబు స్పెష‌ల్ గెస్ట్ గా వ‌చ్చార‌ని తెలుస్తుంది.

దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ఈ నెల 4 పూర్తి చేశార‌ని తెలుస్తుంది. ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటో లు కూడా సోష‌ల్ మీడియా లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో షో కు ఇంకా హైప్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. అలాగే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ల‌ను కూడా త్వ‌ర‌లో వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ప్రిన్స్ మ‌హేష్ బాబు వ‌రుస‌గా షో ల‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌టి కే ఎన్టీఆర్ హోస్టు గా వ‌స్తున్న ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అనే షో లో క‌నిపించారు. తాజా గా బాల‌య్య తో అన్ స్టాప‌బుల్ లో సంద‌డి చేయ‌నున్నారు. దీంతో కొద్ది రోజుల గ్యాప్ లోనే బాబాయి, అబ్బాయి ల షో కి ప్రిన్స్ మ‌హేష్ బాబు వ‌చ్చార‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news